శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (16:55 IST)

పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన సందర్శించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్ ప్రభావం, ముంపు గ్రామాలు, నిర్వాసితుల అంశంపై ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనన్నట్టు సమాచారం. సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోలవరానికి వెళ్లారు. 
 
మరోవైపు, పోలవరం ప్రాజెక్టు పనులను డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఏపీ సర్కారువుంది. కీలకమైన వరద నీరు మళ్లింపు ఇప్పటికే ప్రారంభించారు. డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన 42.5 మీటర్ల ఎత్తులో తలపెట్టిన కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తిచేసిన విషయం తెల్సిందే.