సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (12:46 IST)

ప్రేమించి గర్భవతిని చేశాడు.. పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.. ఏమైందంటే?

ప్రేమించిన వ్యక్తి చేతిలో గర్భవతి అయ్యింది. అంతే ప్రేమికుడు పారిపోయాడు. పదేళ్ల తర్వాత ఊరిలో అడుగుపెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీసింది.. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. దానికి అతడు నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
గరియాబంద్‌కు చెందిన భరత్ 2010లో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా 2011లో ఆ యువతి గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న భరత్ ఊరి నుంచి పరారయ్యాడు. ఏకంగా పదేళ్ల పాటు వేరే ఊర్లో ఉండిపోయాడు. 2012లో సదరు యువతి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 2013లో ఆ చిన్నారి మరణించింది.
 
వేరే యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భరత్ దాదాపు పదేళ్ల తర్వాత ఈ నెల 10న గరియాబంద్‌లో అడుగు పెట్టాడు. భరత్ వచ్చినట్టు తెలుసుకున్న బాధిత యువతి అతడి ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. 
 
అందుకు భరత్ నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. 2010లో తనపై అత్యాచారానికి పాల్పడిన భరత్ తనను గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.