గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:46 IST)

ప్రియుడి కోసం జుట్టుపట్టుకుని నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు..

ఒక ప్రియుడు, ఇద్దరు ప్రియురాళ్లు. ఆ ప్రియుడు కోసం ఇద్దరు ప్రియురాళ్లు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. జుట్టుపట్టుకుని చితకబాదుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. 
 
ఆమె కూడా ఎదురుతిరిగింది. అతను నా ప్రియుడు అంటూ వాదించింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. కిందపడి మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు.
 
నడిరోడ్డుపై అందరూ చూస్తున్నా వారు ఆగలేదు సరికదా, మరింతగా చెలరేగిపోయారు. దీంతో ఓ యువకుడు, ఓ యువతి వారిని అతి బలవంతంగా విడిపించారు. 
 
ఈ విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకునేలోపే యువతులిద్దరూ పరారయ్యారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జరాయ్‌కేలాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.