1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (09:07 IST)

గ్రీస్‌లో కూలిన ఫైర్‌ఫైటింగ్ విమానం .. ప్రాణనష్టం సంగతేంటి?

గ్రీస్‌లో ఓ విమానం కుప్పకూలింది. అగ్నిమాపక విభాగానికి చెందిన ఈ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం తెలిపింది. 
 
పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. ఇతర అగ్నిమాపక సిబ్బంది సహాయం అందించారని పేర్కొంది. 
 
అగ్నిమాపక సిబ్బంది ఆదివారం గ్రీకు ద్వీపమైన ఎవియాలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. వందలాది మంది ప్రజలు తమ తమ నివాసాలను వదిలి వెళ్లారు.
 
గ్రీస్‌, టర్కీ దాదాపు రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటివరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు.. టర్కీలో ఎనిమిది మంది మరణించారు. డజన్ల కొద్దీ జనం ఆసుపత్రి పాలయ్యారు.