శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (15:07 IST)

కొడుకు ప్రేయసిని ఇంటికి పిలిపించి.. చితక్కొట్టిన తల్లి.. ఎక్కడ?

తన కొడుకుతో పెళ్లి చేస్తానని చెప్పి ఓ తల్లి కొడుకు ప్రేయసిని ఇంటికి పిలిచి దాడి చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్‌కు చెందిన భరత్ చంద్ర 26 మోతీ బజార్‌కు చెందిన శ్రావణి 21 నాలుగేళ్ల ప్రేమించుకున్నారు. 
 
భరత్ చంద్రకు ఇటీవలే తల్లిదండ్రులు వివాహం చేసేందుకు సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నెల 27న వివాహం నిశ్చయించారు. దాంతో ఈ నెల 9న బరత్ చంద్ర తన ప్రియురాలి తో కలిసి ఇంటి నుండి పారిపోయాడు.
 
కాగా భారత్ చంద్ర తల్లి అతనికి ఫోన్ చేసి ప్రేమించిన యువతి తోనే పెళ్లి చేస్తానని ఇంటికి రావాలని కోరింది. దాంతో తల్లిని నమ్మి భరత్ చంద్ర ప్రియురాలితో కలిసి ఇంటికి వచ్చాడు. నిన్న రాత్రి భరత్ చంద్ర తల్లి శ్రావణితో వాగ్వాదానికి దిగింది. అంతే కాకుండా శ్రావణిపై ఇనుప రాడ్డుతో తీవ్రంగా దాడి చేసింది. 
 
దాంతో గాయాలతో శ్రావణి బయటకు వచ్చింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.