గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (10:19 IST)

రూ.70లక్షలు మోసం చేశాడు.. విచారణకు హాజరైన ఆర్య

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించాడని నటుడు ఆర్యపై సైబర్‌ క్రైం పోలీసులకు శ్రీలంక యువతి ఫిర్యాదు చేసింది. ''ఈ కేసు విషయమై నటుడు ఆర్య మంగళవారం రాత్రి సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఆర్య 2019లో నటి సాయేషాను వివాహమాడారు. వీళ్లకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది.
 
జర్మనీలో ఉంటున్న శ్రీలంకకు చెందిన యువతి విద్జా.. నటుడు ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించినట్లు జర్మని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భారత రాష్ట్రపతి, ప్రధానులకూ ఆమె లేఖ రాశారు. దీంతో నటుడు ఆర్యకు చెన్నైలోని సైబర్‌క్రైం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆ ప్రకారం మంగళవారం రాత్రి ఆర్య సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌ గీత ఎదుట హాజరయ్యారు.
 
సుమారు మూడు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు ఆర్య. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ఈనెల 17న మళ్లీ విచారణకు రానుంది.