మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:23 IST)

మెడపై కత్తి పెట్టి అత్యాచారం చేయబోయాడు, అంతలో...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 30 ఏళ్ల వివాహితపై అత్యాచార ప్రయత్నం చేసాడు ఓ కామాంధుడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు ఆమె మెడపై కత్తి పెట్టి అత్యాచార యత్నం చేసాడు. ఐతే ఆమె గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడు.
 
వివరాల్లోకి వెళితే... ముజఫర్ నగర్ జిల్లా పరిధిలో 30 ఏళ్ల వివాహిత తన పుట్టింటికి వచ్చింది. ఆమెపై విశాల్ అనే యువకుడు కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లైంగికంగా అనుభవించాలనుకున్న అతడు వివాహిత ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలోకి చొరబడ్డాడు. తనతో తెచ్చుకున్న కత్తిని ఆమె మెడపై పెట్టి అత్యాచారం చేయబోయాడు.
 
వివాహిత ధైర్యం చేసి గట్టిగా కేకలు వేసింది. దీనితో ఇంట్లో వున్న ఆమె తల్లిదండ్రులు రావడంతో అతడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.