మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:40 IST)

కర్మాన్ ఘాట్ కెనెరా బ్యాంకులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని కర్మాన్‌ఘాట్‌లో ఉన్న కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే కర్మాన్‌ఘాట్‌ బాలాగౌడ్ కాంప్లెక్స్‌లో ఈ బ్యాంకు శాఖ కార్యాలయం వుంది. ఈ శాఖలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. 
 
షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
అయితే షెట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలు పగులగొట్టింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.