మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:31 IST)

రాజస్థాన్‌లో కారును ఢీకొన్న ట్రక్కు... ఐదుగురి దుర్మరణం

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ కారును ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మణం పాలయ్యారు. 
 
నాగౌర్‌లోని కుచమన్ వద్ద శనివారం ఓ ట్రక్కు.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
 
క్షతగాత్రుల్లో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం జైపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
 
కాగా, మృతుల కుటుంబాలకు సీఎం అశోక్‌ గెహ్లాత్‌ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే, ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.