1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (09:14 IST)

కడప అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన బ్రహ్మంగారి మఠం మండలం అగ్రహారం దగ్గర చోటుచేసుకుంది. 
 
క్షతగాత్రులను కడప సర్వజన ఆస్పత్రికి బాధితులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్ణాటకలోని మొగల్కోట్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని భావిస్తున్నారు.