మంత్రి ఎర్రబల్లి జస్ట్ ఎస్కేప్ : వాహనం ధ్వంసం
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెద్ద ప్రమాదం తప్పింది. అమిత వేగంగా వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ దుక్కిదున్నే చక్రాలు తగిలాయి. ఈ ఘటనలో మంత్రి ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదం మహబూబాబాద్ జిల్లా వెలిశాల, కొడకండ్ల మధ్యలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు మంత్రి ఎర్రబెల్లి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఎర్రబెల్లి క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతోంది.
ఈ ఘటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఆయన మరోకారులో వెళ్లిపోయారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం ఉన్నట్లు అర్థం అవుతోంది. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.