ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (08:33 IST)

ఆఫ్రికా దేశం మాలిలో ఘోర : 41 మంది మృత్యువాత

ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్‌ పేలడంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి. ఏటా అక్కడి దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాదాల్లోనే 26 మంది చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.