తప్పించుకుని విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాం: మాజీ ఎమ్మెల్యే అనిత
కొండపల్లికి నిజనిర్ధారణకు వెళుతుంటే... మమ్మల్నిపోలీసులు అడ్డుకున్నారు.... మేం ఎలాగూ తప్పించుకుని ఇలా ఆర్టీసీ బస్సు ఎక్కాం. కనీసం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూడా మమ్మల్ని వెళ్లనివ్వడం లేదు. అప్పటి ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి... అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు.
కొండపల్లి అక్రమ మైనింగ్ పైన టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 10 మందిలో 8మందిని పోలీసులు నిర్బంధించగా, ఇద్దరు సభ్యులు పోలీసు అడ్డంకులను, నిర్బంధాలను తప్పించుకుని ఆర్టీసీ బస్ ఎక్కారు. అందులో మాజీ ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు.
మేం ఇపుడు కొండపల్లికి ఎలాగూ వెళ్ళలేం... కనీసం విజయవాడలో టీడీపీ పార్టీ ఆఫీస్ కు చేరుకుందామని ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ పరిస్థితి నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది. జగన్ ఎన్ని ఆటంకాలు కల్పించినా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన నిజానిజాలను వెలికితీస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.