సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 డిశెంబరు 2025 (12:36 IST)

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

sasirekha song
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "మన శంకరవరప్రసాద్ గారు" (ఎంఎస్‌జీ) చిత్రం నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన 'మీసాలపిల్ల' పాట చార్ట్‌‍బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో రెండో పాటపై నెలకొన్న అంచనాలను అందుకుంటూ ఈ గీతం శ్రేతలను ఆకట్టుకుంటుంది.
 
వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గేయ రచన చేశారు. ఈ గీతాన్ని భీమ్స్‌తో కలిసి ప్రముఖ నేపథ్యగాయని మధుప్రియ ఆలపించారు. భాను మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇందులో చిరంజీవి, నయనతార సంప్రదాయ వస్త్రధారణలో మరింత అందంగా కనిపిస్తున్నారు. పైగా, వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
 
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. కేథరిన్ థ్రెసా మరో కథానాయికగా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి.హరికృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.