విజయవాడలో ముస్లిం మత పెద్దల సమావేశం, ఎజెండా ఏంటో?
విజయవాడ నగరంలో రాష్ట్రీయ ముస్లిం సమాజం మత పెద్దలు సమావేశం రేపు అంటే శనివారం జరగనుంది. దీని కోసం డిల్లీ నుండి ప్రత్యేకంగా శనివారం మౌలానా సైయద్ అజ్జాద్ మదానీ నగరానికి రానున్నారు.
మౌలానా సైయద్ అజ్జాద్ మదానీ ఆధ్వర్యంలో శనివారం జరిగే ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లిం లు ఎదుర్కొంటున్నసమస్యలు, సవాళ్లు పై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఆంద్రప్రదేశ్ ఉలమా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తి ఫారూఖ్ దీనిపై శుక్రవారం లబ్బిపేట ఉలమా కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సైయద్ అజ్జాద్ మదానీ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతీయ ముస్లిం నాయకుడని అభివర్ణించారు. షేఖుల్ ఇస్లాం మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ కుమారుడు అని, ఈ సమావేశానికి ఆంద్రప్రదేశ్ లోని ముస్లిం సమాజంలోని ముఖ్యమైన నాయకులు, 13 జిల్లాల నుండి విద్యావేత్తలు రానున్నట్లు తెలిపారు.