విజయవాడ సింగ్ న‌గ‌ర్లో దారుణం, బాలిక‌పై అత్యాచారం

rape
జెఎస్కె| Last Modified గురువారం, 22 జులై 2021 (23:15 IST)
కృష్ణా జిల్లా విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. ప‌దిహేనేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటను అజిత్ సింగ్ నగర్లో వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్
నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉండే బాలిక ఓ దుకాణంలో పని చేస్తూ రోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది.

ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19)తో పరిచయం ఏర్పడింది. దుకాణం ప‌ని అయిపోయాక‌, రాత్రి 11 గంటల సమయంలో తన ఆటోలో కొద్ది మంది ప్రయాణికులతో పాటుగా బాలికను ఎక్కించుకున్నాడు వ‌సంత కుమార్. ఇత‌ర ప్రయాణికులను మాత్రం రాజీవ్ నగర్లో దింపేశాడు.

అనంతరం బాలికను ఎక్సెల్ ప్లాంటు సమీపం వాంబే కాలనీలోని న్యూ ఎన్ఎన్ఎయూఆర్ఎం అపార్టుమెంట్ల వద్దకు తీసుకెళ్లాడు. అక్క‌డ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను ఇంటి పరిసర ప్రాంతంలో దింపేసి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలికను తల్లి నిలదీయగా, జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్యాచారం, పోక్సా యాక్టు ప్రకారం డ్రైవర్ పై కేసు నమోదైంది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ చెప్పారు.
దీనిపై మరింత చదవండి :