బుధవారం, 1 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2025 (13:13 IST)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Vishal and Dhansika family
Vishal and Dhansika family
తమిళ, తెలుగు కథానాయకుడు విశాల్ నటి ధన్సిక ప్రేమలో వున్న విషయం తెలిసిందే. దానిని అధికారికంగా కూడా ఇటీవలే ప్రకటించారు. నేడు ఆగస్టు 29 వారి కుటుంబాల సమక్షంలో నటి సాయి ధన్సికతో తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక సందర్భంగా, అభిమానుల ప్రేమ, మద్దతుకు విశాల్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వారి నిరంతర ఆశీర్వాదాలు, సానుకూల శుభాకాంక్షలు కోరుకుంటున్నారు.
 
ఇరుకుటుంబసభ్యుల నడుమ వున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  వివాహ వేడుకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. మగదరాజా సినిమా తర్వాత తాజాగా అంజలితో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. సహజంగా సినిమాలలో యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేస్తున్న విశాల్ ఇకపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.