పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా 50 యేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి రజనీకాంత్ ఇచ్చిన రీట్వీట్ ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే అంశంపై రజనీకాంత్ కాంత్ ఆదివారం స్పందించారు.
'ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా సోదరుడు, పొలిటికల్ తుఫాను పవన్ కల్యాణ్‌గారు.. ప్రేమతో మీరు చెప్పిన విషెస్‌కు ఉప్పొంగిపోయా. దాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని రజనీకాంత్ పేర్కొన్నారు.
దానిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 'బిగ్ బ్రదర్ రజనీకాంత్.. మీ అభిమానం, ఆశీస్సులకు కృతజ్ఞుడిని. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని పేర్కొన్నారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు కమల్‌హాసన్ తదితరులు రజనీకాంత్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.