గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 జులై 2021 (18:12 IST)

అత్యధిక సంఖ్యలో యాంటీబాడీ కాక్‌టైల్‌ ఇంజెక్షన్లును నిర్వహించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 150కు పైగా కోవిడ్‌-19 కాక్‌టైల్‌ యాంటీ బాడీ ఇంజెక్షన్లను అందించిన ఒకే ఒక్క హాస్పిటల్‌గా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ నిలిచింది. ఔషద కంపెనీలు  (సిప్లా మరియు రోష్‌లు )కరోనా వైరస్‌ యాంటీ బాడీ కాక్‌టైల్‌ ఔషదాన్ని విడుదల చేశాయి. కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు మరియు రోగి హాస్పిటల్‌  అడ్మిట్‌  అవసరం లేకుండా ఈ కాక్‌టైల్‌ ఇంజెక్షన్లను ఇస్తారు. మణిపాల్‌ హాస్పిటల్‌ వద్ద ఈ యాంటీ బాడీ కాక్‌టైల్‌ తొలి ఇంజెక్షన్‌ను 01 జూన్‌ 2021వ తేదీన అందించారు.
 
దీని గురించి కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ జి ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌ 19 పాజిటివ్‌ కావడంతో పాటుగా కోమార్బిడిటీలు (రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్‌ చికిత్స సహా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు)తో అత్యధిక ప్రమాదం కలిగిన వ్యక్తులకు ఈ ఇంజెక్షన్‌ను అందించాము. ఈ ఇంజెక్షన్‌ను 12 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు అందించాము..’’ అని అన్నారు.
 
కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ లోకేష్‌ గుత్తా మాట్లాడుతూ, ‘‘మేము యాంటీబాడీ కాక్‌టైల్‌ ఇంజెక్షన్‌ను అందిస్తున్నాం.  ఇది రెండు హ్యుమన్‌ ఐజీజీ1 మోనోక్లోకల్‌ యాంటీబాడీల పునః సంయోగం. ఈ కాక్‌టైల్‌ ఇంజెక్షన్‌ ప్రధానంగా మోస్తరు కోవిడ్‌ లక్షణాలు కలిగి, కోమార్బిడిటీలు కలిగి ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మానవకణాలలోకి  50% వైరల్‌ లోడ్‌ ప్రవేశాన్ని అడ్డుకోవడంలో ఈ ఇంజెక్షన్‌ సహాయపడుతుంది. అందుబాటులోని సమాచారం వెల్లడించే దాని ప్రకారం ఈ కాక్‌టైల్‌ ఇంజెక్షన్‌, ఎన్నో రకాల వేరియంట్స్‌ అయినటువంటి ఆల్ఫా (బీ.1.1.7), బీటా(బీ.1.351), గామా (పీ.1) పై చక్కగా పనిచేస్తుంది మరియు ఇప్పటి వరకూ సెకండ్‌ వేవ్‌ కు అధికంగా కారణమని భావిస్తున్న డెల్టా వేరియంట్‌ (బీ.1.617.2)పై సైతం ఇది చక్కగా పనిచేస్తుంది.
 
ఈ ఇంజెక్షన్‌ అందుకున్న వారిలో మరణాలు సంభవించకపోవడంతో పాటుగా ఇంజెక్షన్‌కు సంబంధించిన దుష్పరిణామాలు కూడా లేవు. అత్యధిక ప్రమాదం బారిన పడే వ్యక్తులకు పరిస్థితి విషమించక ముందు ఈ చికిత్స సహాయపడుతుంది. అలాగే హాస్పిటల్‌లో చేరాల్సిన ప్రమాదం 90% వరకూ తగ్గించడంతో పాటుగా కోవిడ్‌ లక్షణాలు నాలుగు రోజులలో తగ్గించేందుకు సైతం సహాయపడతుంది. అయితే, ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను సైతం తట్టుకునే శక్తితో కూడిన నూతన వేరియంట్లు భవిష్యత్‌‌లో వచ్చే అవకాశాలున్నాయి కావున, క్లీనికల్‌గా రోగి మెరుగ్గా ఉండేందుకు 21 రోజుల పాటు పరిశీలనలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని అన్నారు.
 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ ుఈ ఇంజెక్షన్‌ను ఒకే మోతాదులో మాత్రమే అందిస్తారు. కాక్‌టైల్‌ ఇంజెక్షన్‌కు డిమాండ్‌ పెరుగుతుండటం మేము చూశాము. మరీ ముఖ్యంగా 50 సంవత్సరాలకు పైబడిన వయసుగల రోగుల నుంచి ఈ డిమాండ్‌ అధికంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలను అందించడలో  ఎల్లప్పుడూ అగ్రగామిగా మణిపాల్‌ హాస్పిటల్‌  నిలుస్తుంటుంది. కాక్‌టైల్‌ యాండీ బాడీ ఇంజెక్షన్‌కు లభించిన స్పందన పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం.
 
జూన్‌ 01వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 150కు పైగా కాక్‌టైల్‌ ఇంజెక్షన్లను మేము రోగులకు అందించాము. తెలుగు రాష్ట్రాలలో ఇది అత్యధికం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటంతో పాటుగా కోవిడ్-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందిగా మేము అభ్యర్ధిస్తున్నాము. కోవిడ్‌ 19తో జరుగుతున్న పోరాటంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అర్హత కలిగిన వ్యక్తులంతా కూడా ముందుకు రావడంతో పాటుగా తమంతట తాముగా వ్యాక్సిన్‌లను వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం..’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘తమ వద్ద కోవిడ్‌-19 చికిత్సకు సంబంధించి కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌.జి; కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ డాక్టర్‌ లోకేష్‌ గుత్తా; కన్సల్టెంట్‌ నెఫ్రాలజి డాక్టర్‌ శ్రీధర్‌ ఏవీఎస్‌ఎస్‌ఎన్‌ మరియు సీనియర్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసన్‌ డాక్టర్‌ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌తో కూడిన ప్రత్యేక బృందం అత్యుత్తమ సేవలనందించనుంది’’ అని అన్నారు.