సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 డిశెంబరు 2025 (23:24 IST)

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

ustad  bhagat singh
'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విశాల్ దద్లానీ పాడిన పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ పాటకు ప్రోమోను డిసెంబరు 9వ సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టరు ద్వారా వెల్లడించారు. 
 
'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొనివున్నాయి. 'మీరు ప్రేమించిన ఈలలు వేసిన పవర్ స్టార్ ఇపుడు మరింత శక్తి, సరికొత్త యాటిట్యూడ్‌తో రాబోతున్నారు' అంటూ చిత్ర యూనిట్ ఈ పాటపై కామెంట్స్ చేసి అంచనాలను పెంచేసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగ ప్రకటనతో పవర్ స్టార్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. డీఎస్పీ మ్యూజికల్ బ్లాస్ట్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.