శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:18 IST)

విహార యాత్రలో విషాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అరెస్టు

కడప జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. విహార యాత్రలో విషాదం జరిగింది. జిల్లాలోని పెన్నానదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
చనిపోయిన వారు కర్నాటక‌లోని రాయ్‌చూర్‌కు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. కర్నాటక‌లో నివాసం ఉంటున్న ఓ ఫ్యామిలీ కడపలో ఉంటున్న వారి చుట్టాల ఇంటికి వెళ్లారు. దీంతో అందరు కలిసి పెన్నానదిని చూడడానికి వెళ్లారు. 
 
అక్కడే ఉన్న ఓ కుంటలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వాళ్లను కాపాడడానికి వెళ్లిన యువకుడు కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.