శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (11:06 IST)

హిజ్రాగా మారితే పెళ్లాడతాన్న మహిళ... మోసపోయిన యువతి

ఓ యువతి ఓ మహిళ చేతిలో మోసపోయింది. హిజ్రాగా మారితే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిన యువతి హిజ్రాగా మారింది. హిజ్రాగా మారిన తర్వాత ఆ మహిళ పెళ్లికి ముఖం చాటేసింది. దీంతో మోసపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. కారుణ్య నియామకాల్లో భాగంగా ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. శిక్షణ సమయంలో ఓ మహిళ యువతికి పరిచయమైంది. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో హిజ్రాగా మారితే పెళ్లాడతానంటూ మహిళ నమ్మబలికింది. 
 
ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
హిజ్రాగా మారమని చెప్పి, మారిన తర్వాత తనను మోసం చేసిందంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు.