గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (17:10 IST)

బుల్లితెర హీరోను పెళ్లి చేసుకున్న యాంకర్ ప్రశాంతి..

prashanthi
యాంకర్‌గా వచ్చి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'మా' టీవీలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో ఆమె 'లాస్య' గా ఓ నెగిటివ్ రోల్ చేస్తూ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ప్రశాంతి ఓ బుల్లితెర హీరోను పెళ్లి చేసుకుంది. ఏకంగా దండలు మార్చుకుంది. ఇదంతా ఎపుడు.. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? ఇది నిజం పెళ్లి కాదులేండి.
 
అది ఈటీవీలో వచ్చే క్యాష్ షోలో జరిగిన ఉత్తుత్తి పెళ్లి. ఇటీవల క్యాష్ షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో బుల్లితెర నటులు పాల్గొన్నారు. శిరీష-సన్నీ, వాసుదేవ్ -కరుణ, పవన్- అంజలి, విశ్వ- ప్రశాంతిలు జంటలుగా వచ్చి బాగా సందడి చేశారు. 
 
ఇక ఇందులో ప్రశాంతిని బాగా హైలెట్ చేసింది. నీ బాయ్ ఫ్రెండ్‌ను ఎంతకాలం దాచిపెట్టావు అని ప్రశ్నించింది సుమ. వెంటనే.. దాచి పెట్టుకొని పంపించిన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా? లేదా దాచిపెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా అని కౌంటర్ వేసింది ప్రశాంతి. ఇక ఫైనల్ గా షోలో 'షో'లో పాల్గొన్న జంటలకు దండలు మార్పిస్తూ ఉత్తుత్తి పెళ్లి చేసింది సుమ.