వీడని చిక్కుముడిలా ప్రియమణి పెళ్లి
మంచి డాన్సర్‌గా పేరొంది టాలీవుడ్‌ను ఒకప్పుడు ఊపేసిన ప్రియమణి, కూల్‌గా డాన్స్ షోలకు జడ్జిగా టైం పాస్ చేస్తోంది. మళ్లీ యమదొంగ లాంటి సినిమా ఛాన్స్ రాకపోయినా... చాలా గ్యాప్ తర్వాత నారప్ప సినిమాతో ప్రియమణి రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ గ్యాప్లో జరిగిన ఆమె పెళ్ళి... ఇంకా చిక్కుముడిగానే మిగిలిందట. అదే మనస్తాపంతో పాపం ప్రియమణి అన్యమనస్కంగానే షోలకు హాజవుతోందట.
తాజాగా హీరోయిన్ ప్రియమణి పెళ్ళి గొడవ... కోర్టు వరకు చేరి చిక్కుల్లో పడింది. ప్రియమణి, ముస్తాఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే… ప్రియమణితో జరిగిన తన భర్త ముస్తఫా రాజ్ పెళ్లి… చెల్లబోదని అతని మొదటి భార్య అయేషా తాజాగా ప్రకటించింది. ముస్తఫా అధికారికంగా తనతో డైవర్స్ తీసుకోలేదని, మొదటి భార్య అయేషా స్పష్టం చేసింది. దీనిపై అయేషా ఆమె కుటుంబ సభ్యులు కలిసి, ప్రియమణి దంపతులపై కేసు నమోదు చేశారు.
మొదటి భార్యతో ముస్తఫా దూరంగా ఉన్నప్పటికీ, ఇంకా అతనికి విడాకులు రాలేదు. అందుకే ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధమని ఆయేషా ఖండించడమే కాదు... తాజాగా ముస్తఫా రాజ్‌పై అతని మొదటి భార్య అయేషా గృహ హింస కేసును నమోదు చేసింది.
ఈ కేసుపై మేజిస్ట్రేట్ కోర్టు కూడా తాజాగా విచారించింది. ఈ సందర్భంగా చట్టప్రకారం ముస్తఫాల భార్య అయేషానే అని, ప్రియమణితో అతడి వివాహం చెల్లదు అని తెల్చేసింది కోర్టు. దీంతో హీరోయిన్ ప్రియమణికి కొత్తగా పెళ్ళి చిక్కులు వచ్చి పడ్డాయి.