బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (16:55 IST)

ఆ నటిని నగ్నంగా అడిషన్ ఇవ్వమని కోరిన శిల్పాశెట్టి భర్త!

పోర్నో ఫోటోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు సంబంధించిన ఒక్కో ఆరోపణ ఇపుడు బయటకు వస్తుంది. తాజాగా సాగరికా సోనా సుమన్ అనే మోడల్, నటి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌కుంద్రా ఓసారి తనను న్యూడ్‌గా అడిషన్స్ ఇవ్వమని కోరాడిని ఓ వీడియోను రిలీజ్ చేసింది. 
 
శిల్పాశెట్టి భర్తపై ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, మీటూ, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్‌కుంద్రా తాజాగా ఫోర్న్ రాకెట్ కేసులో సూత్రధారిగా అరెస్టయ్యారు. అయితే వెబ్ చిత్రాలు నిర్మిస్తున్నానే నెపంతో కొంత మంది అమ్మాయిలను ఆడిషన్ చేసేవాడు. ఆ అడిషన్‌లో పాల్గొన్నవారిలో నటి మోడల్ సాగరిక సోనా సుమన్ కూడా ఉన్నారు. 
 
ఈమె ఇపుడు రాజ్‌కుంద్రాతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిర్గతం చేసింది. రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో... కొంతకాలంగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నా పెద్దగా అవకాశాలు రాలేదని, గతేడాది ఉమేశ్ కామత్ అనే వ్యక్తి కాల్ చేసి, రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా ఎవరు అని అడిగితే శిల్పా శెట్టి భర్త అని కూడా చెప్పాడు. అంటూ ఆ వీడియోలో చెప్పింది.
 
లాక్డౌన్ కాబట్టి వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో నేను కాల్ చేశాను. ఇక కాల్ చేశాక న్యూడ్‌గా ఆడిషన్ ఇవ్వమనడంతో షాకయ్యాను. అలా కుదరదని గట్టిగా చెప్పాను. ఆ వీడియో కాల్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారనీ, వీరిలో ఓ వ్యక్తి మాత్రం తన ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్తపడినట్టు చెప్పింది. 
 
బహుశా అతనే రాజ్ కుంద్రా అని అనుకుంటున్నట్టు చెప్పింది. అతడే కనుక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లయితే అరెస్ట్ చేసి, నాలా ఇంకెంతమందితో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడో విచారించి ఈ రాకెట్ బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నాను అని సాగరికా సోనా సుమన్ వ్యాఖ్యానించింది.