శుక్రవారం, 22 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (16:24 IST)

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

Bus fire
Bus fire
ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాబూల్‌కు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17 మంది పిల్లలు కూడా ఉన్నారు. బస్సు డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలోని వెళ్లిన బాధితులను రక్షించలేకపోయారు. అప్పటికే బస్సు మొత్తం సజీవదహనమైంది. 
 
బస్సు ఒక ట్రక్కు మోటార్‌బైక్‌ను ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగి చాలా మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు సర్వసాధారణం, ప్రధానంగా రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా. గత కొన్ని నెలల్లో దాదాపు 1.8 మిలియన్ల మంది ఆఫ్ఘన్‌లను ఇరాన్ నుండి బలవంతంగా తిరిగి పంపించారు. 
 
ఈ సంవత్సరం ప్రారంభం నుండి పాకిస్తాన్ నుండి మరో 1,84,459 మందిని తిరిగి పంపించారు. అలాగే 5,000 మందికి పైగా టర్కియే నుండి బహిష్కరించబడ్డారు. అదనంగా, దాదాపు 10,000 మంది ఆఫ్ఘన్ ఖైదీలను స్వదేశానికి తరలించారు, వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ నుండి వచ్చిన వారే.