మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (19:38 IST)

రష్మిక మందన్నాకు పుట్టిన రోజు.. మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్ వీడియో వైరల్

కన్నడ సోయగం రష్మిక మందన్నాకు నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రష్మిక కోస్టార్, మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రక్షిత్‌శెట్టి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కిరీక్‌పార్టీ కోస్టార్స్ అయిన రష్మిక, రక్షిత్ గతంలో చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో రక్షిత్‌-రష్మిక తమ పెండ్లిని రద్దు చేసుకున్నారు. 
 
ఈ ఇద్దరూ ప్రొఫెషనల్‌గా తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కిరీక్‌పార్టీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తీసిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రక్షిత్‌శెట్టి. రష్మిక కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడం పట్ల రక్షిత్ హర్షం వ్యక్తం చేశాడు. 
 
"కిరీక్ పార్టీ సినిమా ఆడిషన్స్‌లో నీ అందమైన జ్ఞాపకాలు. నువ్వు అప్పటి నుంచి చాలా దూరం ప్రయాణించావు. నిజమైన వారియర్ లా నీ కలలను ఛేదిస్తున్నావు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు రక్షిత్‌శెట్టి.