19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...
బీటెక్ చదివే 19 ఏళ్ల కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీయడంతో ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో 19 ఏళ్ల కుర్రాడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా 38 ఏళ్ల మహిళ పనిచేస్తోంది.
ఈమెకి పెళ్లయింది, కానీ కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయి ఒంటరిగా వుంటోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ నేపధ్యంలో ఇద్దరూ కలిసి ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో యువకుడు తనకు బెంగళూరులో ఇంటెర్నిషిప్ వుందని గత మే నెల 24న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు.
ఇక అప్పట్నుంచి అతడికి ఫోన్ చేస్తున్నా... మరికొన్ని రోజుల సమయం పడుతుందని చెబుతూ వచ్చాడు. దీనితో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేసారు. యువకుడి ఫోన్ నెంబరు ట్రేస్ చేయగా అది బెంగళూరులో వున్నట్లు తేలింది. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అక్కడి వెళ్లి చూసి షాక్ తిన్నారు. 19 ఏళ్ల యువకుడితో 38 ఏళ్ల మహిళ కలిసి జీవిస్తోంది. వారిద్దర్నీ చిత్తూరుకి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇరువురిని ఎవరి ఇంటికి వారిని పంపించేసారు.