శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (15:55 IST)

పొలం దున్నుతూ రైతు బిడ్డగా మారిన రష్మిక మందన (video)

Rashmika Mandanna
'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరసగా అవకాశాలు అందుకొంది. టాలీవుడ్‌కి వచ్చిన కొద్ది రోజుల్లోలోనే స్టార్ స్టేటస్‌ని సంపాదించుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. 
 
తెలుగులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో హీరోయిన్‌గా నటిస్తోంది. రష్మిక తెలుగులో చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాతో 5 భాషల్లో సందడి చేయబోతోంది. ఆగస్ట్ 13న పుష్ప భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
 
అలాగే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. 'మిషన్ మజ్ను' అన్న హిందీ సినిమాలో రష్మిక మందన్న నటిస్తుండగా సిద్దార్థ్ మల్‌హోత్ర హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
అలాగే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. తండ్రీ - కూతురు మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది. 
 
అలాగే కోలీవుడ్‌లో కార్తి సరసన ఒక సినిమా చేస్తోంది. సుల్తాన్ అన్న టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుండగా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ షూటింగ్‌లో పాల్గొన్న వీడియోని రష్మిక తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 
 
రష్మిక పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. దుక్కిదున్నే యంత్రంతో రష్మిక బురదలోకి పొలం దున్నుతోంది. ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. కాగా సుల్తాన్ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.