మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:22 IST)

ఆడవాళ్లు మీకు జోహార్లు అంటోన్న రష్మిక మందన

Rashmika Mandanna
టాలీవుడ్ సుందరి రష్మిక మందన తాజాగా 'సుల్తాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో 'పుష్ప', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలతో ఖాళీ లేకుండా షూటింగుల్లో పాల్గొంటుంది. 
 
తాజాగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. హుందాకరమైన చీరకట్టుతో రష్మిక అభిమానులను ఆకట్టుకుంటుంది. 
 
ప్రస్తుతం ఆమె హోమ్లీ లుక్‌ వైరల్ గా మారాయి. రష్మిక సరసన శర్వానంద్ నటిస్తుండగా.. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.