శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (10:59 IST)

మెగా పవర్ స్టార్ బర్త్‌డే : సర్‌ప్రైజ్ ఇచ్చిన "ఆచార్య" టీమ్

మెగాస్టార్ చిరంజీవి డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు. దీంతో ఆచార్య చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 
 
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
 
కాగా, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య నుంచి చరణ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చరణ్ తోపాటు చిరు కూడా ఉన్నారు. చిరు చరణ్ ఇద్దరు ఈ నక్సలైట్ గెటప్స్‌లో చేతిలో తుపాకులతో ఎగ్రసివ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే చరణ్ నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో చరణ్ లుక్‌ను చిత్ర యూనిట్ శనివారమే రిలీజ్ చేసిన విషయంతెల్సిందే.