గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (11:26 IST)

"ఆచార్య" లేటెస్ట్ అప్డేట్ ఇదే.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు లక్కీఛాన్స్!!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం మే నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్డేట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా 'బిగ్ బాస్' కంటెస్టెంట్లలో ఒకరికి చిరంజీవి 'ఆచార్య'లో అవకాశం కల్పించినట్టు సమాచారం. ఈ వార్త ఇపుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.
 
"బిగ్ బాస్ సీజ‌న్ 4 ఫినాలే" కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు. ఆ స‌మ‌యంలో ప‌లు వాగ్ధానాలు చేశారు. సోహెల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌కు గెస్ట్‌గా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. దివి, మెహ‌బూబ్‌ల‌కు త‌న సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. 
 
ఇపుడు చిరంజీవి ఆ మాట నిలబెట్టుకున్నారు. మెహ‌బూబ్‌కు 'ఆచార్య‌'లో కీలకమైన పాత్రను ఇచ్చారట‌. మెహ‌బూబ్ ఇందులో జానపద నృత్యకారుడిగా నటిస్తున్నారని.. ఇంటర్వెల్‌లో అతని పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. 'ఆచార్య'లో ఆ పాత్ర ఎమోషన్‌ని రగిలించేదిగా ఉంటుందట. ఇప్ప‌టికే మెహ‌బూబ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, త్వ‌ర‌లో దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌కట‌న రానుంది.