గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:38 IST)

"ఏ జింద‌గీ" సాంగ్ లుక్ పోస్టర్

Akhil, puja
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను బన్నీ వాసు, ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. 
 
ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాట ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన లుక్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది, పాట టైటిల్ కి త‌గ్గ‌ట్లుగా ఏ జింద‌గీ అంటూ సైకిల్ మీద అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే వెళ్తున్న స్టిల్ తో ఈ పోస్ట‌ర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేశారు.