గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (21:46 IST)

రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు.. నాపై దాడి చేస్తారని తెలిసి..? అఖిలప్రియ

తనపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తెలిపారు. భిన్నమైన ఆళ్లగడ్డ రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దాడి చేసేందుకు కాపుకాశారని.. నాపై దాడి చేస్తారని తెలిసి ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీంతో, వెంటనే పోలీసులు స్పందించి వారిని చెదరగొట్టారని వెల్లడించారు భూమా అఖిలప్రియ.
 
ఏ ఎన్నికలైనా అరాచకాలతో గెలవాలనుకుంటే కుదరని కామెంట్ చేసిన అఖిల ప్రియ... దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయవద్దని హితవుపలికారు. కాగా, ఇప్పటికే ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 
 
మరోవైపు.. పాలక, ప్రతిపక్షాలతో పాటు.. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య చోటుచేసుకున్న పరిణామాలు చర్చగా మారుతున్నాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై బెయిల్‌ పైన విడుదల టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. 
 
భూ వివాదం నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన సునీల్ రావు, అనీల్ రావు, ప్రవీణ్  రావులను భూమా అఖిల ప్రియ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆమెకు సికింద్రాబాద్‌లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.