మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జులై 2021 (14:20 IST)

మైనర్ బాలిక ప్రేమించింది.. తండ్రి కూడా ఒప్పుకున్నాడు.. ఐతే ఇంతలోనే..?

ఓ బాలికను యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దాంతో తెలిసితెలియని వయసులో ఆ బాలిక కూడా అతన్నే ప్రేమించింది. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసి ముందు ఒప్పుకోలేదు. అనంతరం ఒప్పుకున్నాడు. కానీ పెండ్లి నిశ్చయమయ్యాక యువకుడి గురించి షాకింగ్ విషయం తెలిసింది. దాంతో పెండ్లి రద్దయింది. ఈ ఘటన గుజరాత్‌‌లోని సూరత్‌లో బెస్తాన్ ఏరియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గోల్డెన్ ఫ్లాట్‌లో ఉండే మహ్మద్ సాజిద్ జారా 15 ఏండ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆమె అతని ఫ్లాట్‌కి ఎదురుగా ఉన్న సొసైటీలోనే ఉండేది. ఆమె కూడా కొన్ని రోజులకు అతన్ని ఇష్టపడింది. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసి బాలికను ప్రశ్నించగా తాను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. 
 
ఈ వయసులో ప్రేమేంటి అంటూ మండిపడ్డాడు తండ్రి. ఆ తర్వాత తన కూతురి జీవితం ఏమవుతుందో ఏమోనని, ఇంటి పరువు పోతుందేమో అని అనుకుంటూ ఆమె మైనర్ అయినా వారిద్దరికీ పెండ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. రెండువైపులా పెండ్లికి అంగీకరించారు. ఇంతలో ఓ రోజు బాలికను సాజిద్ తన ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు.
 
ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటికే అతను ఏడాది కాలంలో రెండు సార్లు అలా చేశాడు. త్వరలోనే పెండ్లి పెట్టుకుని ఏంటి ఇది అని బాలిక ప్రశ్నించింది. త్వరలోనే పెండ్లి అయిపోతుంది అంటూ మాయమాటలు చెప్పాడు.
 
ఇది ఆమెకు నచ్చలేదు. పెండ్లికి ముందే తనను అర్థం చేసుకోవట్లేదు.. ఇక పెండ్లయ్యాక ఏం అర్థం చేసుకుంటాడు అని అనుకుంది. తండ్రి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పింది. పెండ్లికి ముందే మూడుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు అని తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయిన అతను అత్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సాజిద్‌ని అదుపులోకి తీసుకున్నారు.