Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్
First look of Anandi as Burrakatha artist Garividi Lakshmi
బుర్రకథ కళాకారిణి గా నటి ఆనంది తన అప్ కమింగ్ మూవీ గరివిడి లక్ష్మిలో అద్భుతమైన పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఒక డీప్ కల్చర్ ని ప్రజెంట్ చేయబోతోంది. అర్థవంతమైన సినిమాలని రూపొందించడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవలే ఉత్తరాంధ్ర సంప్రదాయాలను అందంగా చూపిస్తూ జానపదం నల జిలకర మొగ్గతో అందరి మనసులు గెలుచుకుంది.
ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనందిని లెజెండరీ గరివిడి లక్ష్మి పాత్రలో పరిచయం చేశారు. హాఫ్ శారీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది, ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది.
గరివిడి లక్ష్మి ఒక గొప్ప బుర్రకథ కళాకారిణి. 1990లలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంప్రదాయాల్ని బతికించి, ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆమె పేరే ఇప్పుడు ఆ ప్రాంత చరిత్రలో నిలిచిపోయింది.
'గరివిడి లక్ష్మి' గ్రామీణ జీవనానికి, సంగీత వారసత్వానికి అద్భుతమైన ట్రిబ్యూట్ లా ఉంటుంది. ఇది ఓ ఎమోషనల్ జర్నీ, మన సంస్కృతి మీద ప్రేమతో చేయబడ్డ ఎంటర్టైనర్.
చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమా, ఉత్తరాంధ్రని ఆవిష్కరిస్తూ మనసుని తాకేలా ఉంటుంది. జె. ఆదిత్య ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
తారాగణం: ప్రముఖ నటుడు నరేష్, రాసి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని