1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (20:15 IST)

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

velu prabhakaran
కోలీవుడ్ నటుడు వేలు ప్రభాకరన్ మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన చెన్నైలోని కొట్టివాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు. 
 
గత 1980లో వచ్చిన చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా వెండితెరకు పరిచయమైన వేలు ప్రభాకర్.. 'నాలైయ మనిదన్' సినిమాతో దర్శకుడుగా మారారు. తన సినిమాల ద్వారా సున్నితమైన అంశాలను ఆయన టచ్ చేసేవారు. నటుడుగా కూడా ఆయన మెప్పించలేరు. పలు చిత్రాల్లో నటించారు. 
 
చివరగా గత యేడాది విడుదలైన 'గజన' మూవీలో ఆయన కనిపించారు. గత 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు. 'కాదల్ కథై' చిత్రంలో తనతో కలిసి నటించిన 30 యేళ్ల షిర్లేదాస్‌ను రెండో వివాహం చేసుకున్నారు. 60 యేళ్ల వయసులో 30 యేళ్ల వయసున్న నటిని షేర్లేదాస్‌ను పెళ్లి చేసుకున్నాడు.