1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Husband slits wife-s throat on suspicion she was having an affair with someone else

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

Crime
వరసకు బావ అయ్యే వ్యక్తితో తన భార్య నవ్వుతూ మాట్లాడిందనీ, పార్కులో చాలా సన్నిహితంగా వున్నట్లు మాట్లాడుకున్నారని తెలుసుకున్న భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అతడితో పకపకలూ ఇకఇకలూ ఏమిటంటే గొడవకు దిగాడు. అది కాస్తా పెద్దదయి ఆగ్రహంతో భార్య పీక కోసేసాడు. ఆ తర్వాత అతడు పురుగుమందు తాగి కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని సింధనూరులో రాజేష్, దేవి తమ ఇద్దరి పిల్లలతో కలిసి వుంటున్నారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా కాకినాడలోని తూరంగి గ్రామంలోని అత్తగారింటికి వచ్చారు. ఈ క్రమంలో భార్య దేవి నవంబరు 4న తన అక్క కొడుకు, చెల్లితో కలిసి కాకినాడ కుళాయిచెరువు పార్కుకి వెళ్లింది. అక్కడ దేవి తనకు బావ వరసైన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ వుండటాన్ని ఆమె మరిది చూసి అన్న రాజేష్ కి సమాచారం ఇచ్చాడు.
 
అంతే... ఇంటికి వచ్చిన దేవిపై రాజేష్ ఆగ్రహంతో అతడితో ఎందుకు మాట్లాడావు, నీకు అతడికి ఏంటి లింక్ అంటూ భార్యపై కేకలు వేసాడు. అది కాస్తా మరింత పెద్దదై కత్తితో భార్య పీక కోసేసాడు. ఆ తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో తాళ్లరేవు పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆ తర్వాత తన పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రాజేష్ భార్య దేవికి గొంతు నుంచి భుజం వరకూ తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్