1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Prostitution in Chikkadapally Hotel, Womens Arrest

చిక్కడపల్లి హోటల్‌లో వ్యభిచారం... చిక్కిన అందమైన అమ్మాయిలు

Hyderabad
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి హోటల్‌ గదిలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యభిచారం చేస్తున్న అందమైన అమ్మాయిలతో పాటు... విటులను కూడా పట్టుకున్నారు. అలాగే, మేనేజర్‌ బి.ఉషశ్రీ (22) సహా హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇ.శ్రీకాంత్‌(24), కె.సాయికుమార్‌(23)లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, పది నిరోధ్‌ ప్యాకెట్లు, 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సూర్యాపేటకు చెందిన ఉషశ్రీ హోటల్‌లోని గదిని అద్దెకు తీసుకుని సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ - ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. 
 
హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ చేస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీకాంత్‌, నల్గొండకు చెందిన సాయికుమార్‌ ఆమెకు సహకరించేవారు. సెక్స్‌వర్కర్లను తీసుకువచ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న విష్ణు, ధర్మ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఓపెన్ ఎగ్జామ్ సిస్టమ్...