సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (15:46 IST)

ఆసియాలోనే ఉత్తమ ఎయిర్‌పోర్టు ఏది?

హైదరాబాద్ నగర నగరంలోని శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకి మరోమారు ఆసియాలోనే ఉత్తమ ప్రాంతీయ ఎయిర్ పోర్టు అవార్డు లభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి ఈ అవార్డు రవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 
 
ఈ మేరకు స్కైట్రాక్స్ వ‌ర‌ల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డుల కార్య‌క్ర‌మంలో ఈ ప్రకటన చేశారు. టాప్-100 జాబితాలో హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుకు 64వ స్థానం ల‌భించ‌గా, శుభ్ర‌త‌లో 3, ఎయిర్‌పోర్టు సిబ్బంది విష‌యంలో ఆర్‌జీఐఏకు 4వ ర్యాంకు వ‌చ్చినట్టు జీఎంఆర్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.