Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో కన్నడ నటి.. ఆమె ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్-9 కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుందని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి, బిగ్ బాస్ తెలుగు 9 కోసం పోటీదారులు ఎవరనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తాజాగా కన్నడ నటి కావ్య శెట్టి ఈ షోలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కావ్య శెట్టి ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉందని టాక్ వస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 కోసం అధికారిక పోటీదారుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. ఇంతకుముందు కన్నడ నటి శోభా శెట్టి కూడా బిగ్ బాస్ తెలుగు-7లో పాల్గొన్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, కన్నడ పరిశ్రమ నుండి తెలుగు చిన్న స్క్రీన్లపై తనదైన ముద్ర వేసిన నటి కావ్య శెట్టి బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. బిగ్ బాస్ 9 తెలుగు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ నాటికి ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.