శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (09:59 IST)

దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొన్ని రోజుల తర్వాత పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గడంతో.. రూ.47,840కు చేరింది. 
 
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గడంతో రూ. 43,850 కు చేరింది. బంగారం ధర తగ్గగా… మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.1500 తగ్గి రూ.70,200 వద్దకు చేరింది.
 
ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.
 
అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉంది.
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.