మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (08:58 IST)

బంగారం ప్రియులకు శుభవార్త...

దేశంలో బంగారం ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధర ఏ స్థాయిలో ఉన్నప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయడంలో ఏ మాత్రం వెనుకంజ వేయరు. ఫలితంగా ఈ ధరలు ఒక్కో సందర్భంలో ఆకాశాన్ని తాకుతుంటాయి. అయితే, తాజాగా బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. బంగారం ధర వరుసగా రెండో రోజు తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం. పసిడి బాటలోనే వెండి కూడా దిగివచ్చింది. 
 
శనివారం లెక్కల ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,660కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 తగ్గుదలతో రూ.44,600కు క్షీణించింది. ఇక, వెండి రేటు కూడా బంగారం దారిలోనే పయనించింది. వెండి రేటు రూ.600 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.71,700కు దిగొచ్చింది.