సంబంధిత వార్తలు
- Yash: టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను 120 కోట్లకు సొంతం చేసుకున్న దిల్ రాజు
- Yash: టాక్సిక్ టీజర్ లో శశ్మానంలో గన్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్
- Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ లో రుక్మిణి వసంత్ లుక్
- Spirit update: ప్రభాస్ నూతన చిత్రం స్పిరిట్ నుంచి కొత్త పోస్టర్
- Nayanthara: రాకింగ్ స్టార్ యశ్ మూవీ టాక్సిక్ లో నయనతార ఫస్ట్ లుక్
Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?
Yash - Toxis new poster
ఒక్కో కారెక్టర్, పాత్రకు సంబంధించిన సంబంధించిన లుక్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్లు ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. టాక్సిక్ వరల్డ్‌ని పరిచయం చేసేలా యశ్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇక ఈ మూవీ నుంచి మరి కొంత కథను రివీల్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. కథ, కథనం ప్రభావం అన్ని భాషల్లో ఒకేలా ఉండేందుకు టీజర్‌ను ఒకే భాషలో విడుదల చేస్తారట. ఇది సినిమాలో స్పష్టమైన చిత్రాలను, వాతావరణాన్ని, ఆ ప్రపంచాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది.
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ నదియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. చివరగా రాయ పాత్రలో యశ్‌ను చూపించిన తీరు, వదిలిన పోస్టర్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చింది. కాగా, ఈరోజు పోస్టర్ ద్వారా యశ్ ఏం చెప్పబోతున్నాడంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
యశ్, గీతు మోహన్‌దాస్ సంయుక్తంగా రాసిన ఈ కథని గీతు మోహన్‌దాస్ తెరపైకి తీసుకు వచ్చారు. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, అనేక ఇతర భాషలలో డబ్ చేయనున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరామెన్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా, టిపి అబిద్ ప్రొడక్షన్ డిజైనర్‌గా అద్భుతమైన సాంకేతిక బృందం ఈ మూవీకి పని చేసింది. జాతీయ అవార్డు గ్రహీత యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్, కేచా ఖంఫక్దీలతో కలిసి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ ఈ చిత్రంలో యాక్షన్ సీన్లకు కొరియోగ్రఫీ చేశారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన టాక్సిక్ ఈద్, ఉగాది, గుడి పద్వా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 19 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.
