శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:18 IST)

బంగారం లాంటి మనసున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌తో జండూబామ్‌ భాగస్వామ్యం

ప్రతిష్టాత్మకమైన నొప్పి నివారణ పరిష్కారంగా 100 సంవత్సరాలుగా ఖ్యాతిగడించడంతో పాటుగా ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి సంస్థలలో ఒకటైన ఇమామీ లిమిటెడ్‌ తయారుచేసి, మార్కెటింగ్‌ చేస్తున్న జండూ బామ్‌, ఇటీవలనే బంగారం లాంటి మనసున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నుకుంది.
 
స్వాభావికంగా దయార్ద్ర హృదయం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన నటుడు సోనూ సూద్‌, గత కొద్ది సంవత్సరాలుగా నిరుపేద ప్రజలకు తోడ్పాటునందిస్తూ చేపట్టిన తన మానవతా, దాతృత్వ కార్యక్రమాల చేత  సుప్రసిద్ధమయ్యారు. కోవిడ్‌ మహమ్మారి సంక్షోభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన వేలాది నిస్సహాయ వలస కార్మికులను స్వస్తలాలకు చేర్చడం కోసం వ్యక్తిగతంగా ఆయన శ్రద్ధ తీసుకుని చేపట్టిన చర్యల కారణంగానే ఈ నటునిలోని మానవతా కోణం మరింత ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చింది.
 
ఇమామీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ శ్రీ మోహన్‌ గోయెంకా వివరిస్తూ, ‘‘కోవిడ్‌ సంబంధిత ఒత్తిడి లక్షలాది మంది ప్రజలకు తలనొప్పి, ఒళ్లు నొప్పులు మరియు నీరసం కలిగించాయి. ఉద్యోగాలు పోవడం, జీతాల కోతలు, ఆరోగ్యపరమైన సమస్యలు, సాధారణ అనిశ్చితి వాతావరణం మరియు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేత ఎలాంటి సహాయం లేకుండా పలు అంశాలను చేయాల్సి రావడం, తదితర అంశాలన్నీ తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడిని ప్రజలకు కలిగించాయి.
 
ఈ సమస్యలలో చాలా వాటికి నమ్మకమైన ఆయుర్వేద నొప్పి నివారిణి జండూబామ్‌ ఉపశమనం అందించింది. కొంత వరకూ ఇదే రీతిలో, సోనూ సూద్‌ లాంటి అద్భుతమైన వ్యక్తి, కోవిడ్‌ మహమ్మారి సంక్షోభ సమయంలో ఏవిధంగా ముందుకు వచ్చారో, బాధిత వలస కార్మికులతో పాటుగా మరెంతో మంది పేద ప్రజలకు రవాణా మరియు ఇతర ఉపశమన కార్యక్రమాలను తన వ్యక్తిగత ఆసక్తితో చేయడం ద్వారా వారి బాధను పొగొట్టారో మనమంతా చూశాము.
 
మా ప్రతిష్టాత్మక బ్రాండ్‌ జండూ బామ్‌ యొక్క బ్రాండ్‌ సిద్ధాంతం మరియు విలువలు బాధలో ఉన్న ప్రజల సమస్యలకు ఏకీకృత పరిష్కారమన్నట్లుగా నిలిచిన మా నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌ యొక్క సిద్ధాంతం, విలువలను ప్రతిబింబిస్తాయని మేము నమ్ముతున్నాం..’’ అని అన్నారు.
 
ఈ బ్రాండ్‌ భాగస్వామ్యంపై శ్రీ సోనూ సూద్‌ మాట్లాడుతూ, ‘‘ప్రజల బాధలు, కష్టాలెప్పుడూ నా హృదయాన్ని ద్రవింపజేస్తుంటాయి. నా జీవితకాలమంతా కూడా నేను ప్రజల బాధలను పొగొట్టేందుకు నాకు చేతనైంతనగా వీలైనన్ని మార్గాలలో వినయపూర్వక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ప్రతిష్టాత్మక భారతీయ బ్రాండ్‌, జండూబామ్‌, ఎన్నో దశాబ్దాలుగా కోట్లాది మంది వినియోగదారులకు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 
ఈ బ్రాండ్‌ సిద్ధాంతం, బాధలలో ఉన్న ప్రజలకు సహాయపడాలనే నా జీవిత లక్ష్యాలను ప్రతిబింబించడాన్ని నేను కనుగొన్నాను. మన జీవితంలో కష్టాలు, బాధలు అంతర్భాగమని నేను నమ్ముతున్నాను. కానీ మనం వాటిని అధిగమించి, జీవితంలో ముందుకు సాగాల్సి ఉంది. ఈ భాగస్వామ్యానికి బలీయమైన బంధం ఉందని నేను నమ్ముతున్నాను. మేమిరువురమూ ఛలే ఛలో పట్ల విశ్వాసంతో ఉన్నాం’’ అని అన్నారు.