మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 10 జులై 2021 (16:44 IST)

ఆచార్య అప్‌డేట్ః చ‌ర‌ణ్‌తో సాంగ్‌, సోనూసూద్‌తో యాక్ష‌న్‌

Ramcharan song
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా సిద్ధ అనే కీల‌క పాత్ర‌ను రామ్‌చ‌ర‌ణ్ పోషిస్తున్న సినిమా `ఆచార్య‌`. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రమిది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా  'ఆచార్య' షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్‌.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. "రీసెంట్‌గా 'ఆచార్య' ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది" అని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. 
 
అలాగే, రామ్ చ‌ర‌ణ్‌పై ఆహా!మ‌జారే.. అనే త‌ర‌హాలో ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి. అదేవిధంగా సోనూసూద్‌తో ఓ యాక్ష‌న్ సీన్‌ను కూడా తీయ‌బోతున్నారు. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ఎడిట‌ర్‌:న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:సురేష్ సెల్వరాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌. తిరుణ్ణావుక్క‌ర‌సు,మ్యూజిక్‌:మణిశ‌ర్మ‌, నిర్మాత‌:  నిరంజ‌న్ రెడ్డి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:కొర‌టాల శివ‌.