శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (11:56 IST)

పర్యాటక మంత్రిత్వ శాఖ : నాడు చిరంజీవి - నేడు కిషన్ రెడ్డి

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా గతంలో చిరంజీవి పనిచేశారు. ఈయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో స్వతంత్ర హోదాలో మంత్రిగా ఉన్నారు. ఇపుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 
 
కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినేట్ మంత్రిగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్‌ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. 
 
ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా, గ‌త కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే శాఖ.. కిషన్ రెడ్డికి రావడం విశేషం.