పర్యావరణాన్ని కాపాడే దిశంగా మెగాస్టార్ ఫ్యాన్స్
దేశంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పర్యావరణాన్ని కాపాడేదిశగా ప్రతిన పూనారు. ఆగస్టు 22న చిరంజీవిగా పుట్టినరోజు. అందుకు యాభైరోజుల ముందుగానే చిరంజీవి నటించిన కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్టర్‌గా డిజైన్ చేసి అభిమానులు బయటకు విడుదల చేశారు. అది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వృక్షో రక్షితో రక్షితః అనే నినాదాంతో వారంతా ముందుకు సాగుతున్నారు. మొక్కవోని దీక్షతో మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని దిశగా పయనిస్తున్నారు.
ఇటీవలే మన అందరం చూస్తూనే వున్నాం. కరోనా టైంలో పీల్చే ఆక్సిజన్ అందక చాలామంది అసువులు బాశారు. వారికి అండగా మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన ఆక్సిజన్ ప్లాంట్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ ఇన్క్యుటేర్లను అందజేశారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ టీకాలను వృద్ధులకు, వేక్సిన్ అవసరమైన వారికి అభిమానులు వేయించారు. మెగాస్టార్ కూడా హైదరాబాద్‌లో తన బ్లడ్ బేంక్‌లో సినీమారంగంలోని 24 శాఖలకు చెందిన కార్మికులకు కోవిడ్ టీకాలు వేయించారు.
అందుకే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నామని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 1నుంచి 22 వరకు మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపు ఇచ్చారు. ఈలోగా పలు సామాజిక కార్యక్రమాలు అభిమానులు పాల్గొంటారని జైచిరంజీవి, జైజై చిరంజీవ అంటూ నినాదాలతో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు.