నయనతార డిమాండ్ కు ఓకే!
Nayanatara
అయితే తమిళంలో బిజీగా ఉండటం వలన ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. తాజాగా చిరంజీవి చేయనున్న లూసిఫర్ రీమేక్ కోసం కూడా నయనతారనే అడిగారట. మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్ర ఇది. అయితే తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని నయనతార అందనీ, అందుకు మేకర్స్ అంగీకరించారని చెబుతున్నారు.
తమ సినిమాను ఆమెతోనే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే దర్శక నిర్మాతలు చాలామందినే ఉన్నారు. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఆనందంగా అంగీకరిస్తూ ఉంటారు.అలాంటి నయనతారకు తెలుగులోను అదే స్థాయిలో క్రేజ్ ఉంది. అందువలన సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను తీసుకోవడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తుంటారు.

