చిరంజీవి యాక్షన్‌కు వై.ఎస్. జగన్ రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో తన సేకా కార్యకర్తలతో ఆక్సిజన్ బేంక్‌లను ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల సేవ చేశారు. ఇంకోవైపు కరోనా వేక్సిన్ సినీరంగ కార్మికులకు సి.సి.సి. ద్వారా వేయిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వై.ఎస్. జగన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేస్తుందని మెగాస్టార్ మంగళవారంనాడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఒక్కరోజులోనే 13.72 లక్షలమంది వేక్సిన్ వేసిన ఘనత వై.ఎస్.జగన్‌దేనని కీర్తించారు.ఇలా చేయడం వల్ల ఆంధ్రపదేశ్‌లో ప్రజలకు హెల్త్‌పరంగా వారిలో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. మోర్ కంగ్రాట్యులేషన్ ఇన్‌స్పైరింగ్ యువర్ లీడర్‌షిప్ అంటూ శ్లాఘించారు.
ఇక వెంటనే వై.ఎస్.జగన్ బుధవారంనాడు తిరిగి ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవికి తిరిగి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీకు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. మీ నుంచి వచ్చిన అభినందనలు స్వీకరిస్తున్నాం. ఈ క్రెడిట్ అంతా ప్రతి గ్రామంలోని వాలంటీర్లు, ఆషా వర్కర్లు, వార్డ్ సెక్రటేరియట్స్, ఎ.ఎన్.ఎంస్., డాక్టర్స్, మండల అధికారులు, జిల్లా అధికారులకు, జాయింట్ కలెక్టర్లకు, కలెక్టర్లకు ఇలా పేరుపేరునా చెబుతూ వారికి చెందుతుందని జగన్ ట్వీట్ చేశారు.